<?xml version="1.0" encoding="UTF-8"?><song><title>గొల్లతా కొండపైన గాయాలు</title>
<lyrics>[C1]
   గొల్లతా కొండపైన గాయాలు పొందితివా
   గలిలీయుడా నా ప్రియుడా

[V1]
 యూదుల రాజా శుభము
 శుభమని పలికితిరా
 యూదా నీ చెలికాడు దోషిగా మారాడు
 ఓ దైవమా దివి రాజ్యమా
 దోషములన్నియు బాపుమా

[V2]
 నీతి నిజాలకు నేత నేరము చేసితివా
 నా అపరాదము కాదా నిన్ను సిలువేసినది
 నజరేయుడా నరరూపుడా
 నను క్షమియుంచు నాధుడా</lyrics>
<hymn_number>106</hymn_number>
</song>